ఇదే నిజం, ముస్తాబాద్: మండలం గన్నె వారిపల్లె గ్రామం నిమ్మలవారి పల్లెలో విద్యుత్ స్తంభానికి ఉన్న సపోర్ట్ వైర్‌కు విద్యుత్ సప్లై రావడంతో దాని తాకిన రైతు నిమ్మల ప్రభాకర్ విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయసు 40 సంవత్సరాలు కాగా అతనికి భార్య, సంవత్సరం కూతురు ఉన్నది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిమ్మల ప్రభాకర్ మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం అందిన వెంటనే ఎస్సై శేఖర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేయించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.