Homeహైదరాబాద్latest Newsసీఎంకు రైతుల లేఖలు

సీఎంకు రైతుల లేఖలు

ఇదేనిజం, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకర్గంలో పోస్టు కార్డు ఉద్యమం ఉధృతమైంది. ఈ ఉద్యమం సిద్దిపేట నుంచి రైతులు శ్రీకారం చుట్టగా, అది క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నది. కాంగ్రెస్ ఇచ్చిన రూ.500 బోనస్, రుణమాఫీ, రైతుభరోసా, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తానన్న హామీలు అలాగే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలని లేఖలు రాశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కాగా, గత శాసనసభ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వీరికి బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు.

Recent

- Advertisment -spot_img