Homeహైదరాబాద్latest Newsగ్రామస్తుల సహాయంతో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

గ్రామస్తుల సహాయంతో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన రుద్రవేణి తిరుపతి గత నెలలో చనిపోవడం జరిగింది.రాఘవపట్నం,గంగాదేవిపల్లె గ్రామ ప్రజలు చందాల రూపకంగా 51200 రూపాయలు జమ చేసి వారి యొక్క కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఇలాగే ఇటువంటి కార్యక్రమాలకు ఆపదలో ఉన్నవారికి సహాయం చేసిన వారందరికీ ముధిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి కాళ్ల రమేష్ కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాగం శంకరయ్య,మాజీ ఎంపీటీసీలు రాజేందర్ గౌడ్,మధుకర్ రెడ్డి,సింగిల్ విండో డైరెక్టర్ జలంధర్,మాజీ ఉపసర్పంచ్ అంజయ్య,నాయకులు కాళ్ళ రమేష్,శ్రీకాంత్,రాజేశం,చందు,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img