సెన్సషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన సినిమాలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. అతనితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు వెయిట్ చేసెవారు. ఒకప్పుడు టాలీవుడ్ నే శాసించిన పూరీ జగన్నాథ్.. ఇప్పుడు ఒక హిట్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. వరుస డిజాస్టర్లతో పూరీ కెరీర్ డైలమాలో పడింది. విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. పని ఆ తర్వాత హీరో రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే హిట్ సినిమాకి సీక్వెల్ తీశాడు. అయితే ‘డబుల్ స్మార్ట్’ సినిమాకూడా బాక్సాఫీస్ వధ ఢమాల్ అని ఫ్లాప్ అయింది. దీంతో పెద్ద హీరోలు కూడా అతనికి అవకాశాలు ఇవ్వలేదు. అందుకే ఈసారి యంగ్ హీరో సందీప్ కిషన్ తో సినిమా చేయబోతున్నాడు. సందీప్ కిషన్ మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ మాత్రం రావడం లేదు. సందీప్ కిషన్ మామ శ్యామ్ కె నాయుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తన స్నేహితుడు పూరీ జగన్నాథ్‌ని ఒపించాడు. పూరిజగన్నాథ్ కూడా సందీప్ కిషన్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.