HomeతెలంగాణFOREIGN Education : విదేశాల్లో ఉన్నత చదువులు చదువాలనుకుంటున్నారా.. ఇదిగో ఖర్చులకు రూ.20 లక్షలు ఉచితం

FOREIGN Education : విదేశాల్లో ఉన్నత చదువులు చదువాలనుకుంటున్నారా.. ఇదిగో ఖర్చులకు రూ.20 లక్షలు ఉచితం

FOREIGN Education : మీది పేద కుటుంబం.విదేశాల్లో చదివి గొప్పవాళ్ళు కావాలనే అభిలాష ఉంది. చేతిలో సరిపడా డబ్బులు లేవు. కల కల గానే మిగిలి పోతుందని ఆవేదన చెందుతున్నారా? భయపడకండి అవకాశం ఉంది. మీరు ఇంజనీరింగ్, నర్సింగ్, mbbs, ఏదైనా డిగ్రీ మంచి మార్కులతో అంటే 60 శాతం మార్కులు వస్తే చాలు మీకు 20లక్షల రూపాయల సహాయం మీ చదువుకు అందుతుంది. ఈ. డబ్బులు మళ్ళీ చెల్లించ వలిసిన అవసరం లేదు. ఐతే మీ కుటుంబ సంవత్సరం ఆదాయం 5 లక్షలకు మించి ఉండరాదు. జ్యోతిబాపూలే ఓవర్సిస్ పథకం కింద. ప్రతి విద్యార్థికి 20 లక్షలు అందిస్తుంది. ప్రతీ ఏటా 300 మందికి తెలంగాణ ప్రభుత్వం పేద మెరిట్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నది. ఇందులో 30సీట్లు EBC లకు కేటాయించారు. మాస్టర్స్, పీజీ, పీహెచ్డీ కోర్సులకు సహాయం అందిస్తారు. జనవరి లో 150 మంది ని, ఆగష్టు లో మరో 150 మందిని ఎంపిక చేస్తారు. ఈ పథకానికి సెప్టెంబర్ 1 నుంచి 30 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం..

Recent

- Advertisment -spot_img