Homeహైదరాబాద్latest Newsఆర్బీఐ వద్ద భారీగా బంగారం నిల్వలు..విదేశాల నుంచి తరలింపు

ఆర్బీఐ వద్ద భారీగా బంగారం నిల్వలు..విదేశాల నుంచి తరలింపు

విదేశాల్లో బంగారం నిల్వలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యూకేలోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి దాదాపు 100 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ తన ఖజానాకు తరలించింది. 1991 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బంగారం నిల్వలను తరలించడం ఇదే తొలిసారి. రాబోయే నెలల్లో కూడా మరింత బంగారాన్ని తరలించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నాటికి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇందులో దాదాపు సగం 413.8 టన్నులను విదేశాల్లో నిల్వ చేశారు. విదేశాల నుంచి తెచ్చిన బంగారాన్ని ముంబయి మింట్ రోడ్‌లోని ఆర్బీఐ పాత కార్యాలయ భవనంలో, నాగపూర్‌లో నిల్వ చేయనున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img