Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్.. రైతు భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్..!

గుడ్ న్యూస్.. రైతు భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్..!

తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచున్న.. రైతు భరోసా.. కొత్త రేషన్‌ కార్డులు.. ఇందిరమ్మ ఇళ్లు పై అతి త్వరలో కీలక అప్డేట్ వెలువడే అవకాశం ఉంది. ఎలాగంటే.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఇవాళ (10-01-2025) మధ్యాహ్నం 3 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రధానంగా రైతు భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై వారికి దిశానిర్దేశం చేశారు. మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని క్యాబినెట్‌ కూడా తీర్మానించింది. అమలుపై సీఎం.. కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు. దీనిపై విస్తృత ప్రచారం కోసం గ్రామ సభలను నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది.

ALSO READ

Indiramma houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. ఎప్పటినుంచంటే..?

Recent

- Advertisment -spot_img