తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్ల ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇక కోడి గుడ్డ ధర రూ.5.25 నుంచి రూ.4.8కు తగ్గింది. డజన్ కోడి గుడ్లను రూ.57కు మార్కెట్ లో అమ్ముతున్నారు. వర్షాల నేపథ్యంలో వాతావరణం చల్లబడటంతో ధరలు తగ్గినట్లు సమాచారం. ఈ వాతావరణం ఇలాగే ఉంటే ధరలు మరింత తగ్గుతాయని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు.