Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అప్పటిలోగా రైతుల ఖాతాల్లో నగదు జమ..!

రుణమాఫీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అప్పటిలోగా రైతుల ఖాతాల్లో నగదు జమ..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరాలోగా 4వ విడత రుణమాఫీ చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీ అందని అర్హులైన వారికి నిధుల జమ పూర్తి చేయాలని భావిస్తుంది. ఇందుకోసం కసరత్తు ప్రారంభించింది. మొత్తం 4.25 లక్షల మందికి రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. వచ్చేనెల తొలి వారంలో నిధులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దసరా పండుగలోగా ఈ రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే ఇప్పటికే 22 లక్షల మందికి రూ.17,934 కోట్లు మాఫీ చేసింది. రేషన్ కార్డులు లేని రైతులు, ఆధార్, బ్యాంకు అకౌంట్ లో తప్పులు ఉన్నవారికి, కుటుంబ నిర్ధారణ కానివారు, ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నవారికి మాఫీ చేస్తారు. ఈ నెలాఖరుతో ఇందుకు సంబంధించిన డేటా అప్లోడ్ ప్రక్రియ ముగియనుంది. ఈ మేరకు నిధుల సర్దుబాటు పైన దృష్టి పెట్టింది.

Recent

- Advertisment -spot_img