Homeహైదరాబాద్latest Newsములుగు: హామీలను అమలు చేయాలి

ములుగు: హామీలను అమలు చేయాలి

– జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి

ఇదేనిజం, ములుగు ప్రతినిధి : కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జీఎస్​పీ రాష్ట్ర కార్యదర్శి పూనేం సాయి డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన వెంకటాపురం మండలం కొమరం భీం కాలనీ ఆదివాసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాహుల్​గాంధీ 5 షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూమిపై నీటిపై అడవిపై సర్వహక్కులు ఆదివాసీలకి ఉన్నాయన్నారని, ఆయన ఇచ్చిన హామీని కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇది కూడా చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఉచిత బస్సు ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్

కొమరం భీం కాలనీలో ఆదివాసులు 30 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఇక్కడున్న బడ గిరిజనేతరులు వారిపై దౌర్జన్యం చేస్తూ.. చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు. అయినా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు. ఎటురునాగారం ఐటీడీఏ తక్షణమే లీగల్ సెల్ విభాగం ఏర్పాటు చేయాలన్నారు. ఆదివాసులకు ప్రత్యేకంగా స్వయం పాలన కోసం వందరోజుల దండయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్

Recent

- Advertisment -spot_img