ఇదే నిజం, ముస్తాబాద్: మండల కేంద్రంలో పిఆర్టియు-టీఎస్ నూతన కార్యవర్గం ఎన్నికల పరిశీలనకు ఎర్ర ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. పిఆర్టియు-టీఎస్ మండల అధ్యక్షులుగా గుమ్మడి బాలకిషన్ ప్రధాన కార్యదర్శిగా లచ్చగారి శివకుమార్ మహిళ ఉపాధ్యక్షులుగా పండుగ పద్మ కార్యదర్శిగా కీసర స్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బాలకిషన్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పక్షపాతిగా చెప్పుకుంటున్న ప్రభుత్వం సమస్యలను పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలు మంజూరు చేయాలి. జీవో 317 ఇతర జిల్లాలలో పనిచేస్తున్న ఉద్యోగులను వారి వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలి. మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించి వెంటనే బదిలీలు చేపట్టాలి. కేజీ బీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి. సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ ను అమలు చేయాలి. పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించాలి. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి శివకుమార్ . శంకర్ బాబు. పద్మ. స్వామి. బుచ్చిరెడ్డి. వంశీకృష్ణ. తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.