Homeహైదరాబాద్latest Newsకమల్ హాసన్ “ఇండియన్ 2” మూవీ రిలీజ్ వాయిదా పడిందా..?

కమల్ హాసన్ “ఇండియన్ 2” మూవీ రిలీజ్ వాయిదా పడిందా..?

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఇండియన్ 2”. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌లో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ అలాగే సిద్ధార్థ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాని జూన్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ఇప్పటికే ఖరారు చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో ఓ ట్విస్ట్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం ఇండియన్ 2 మూవీ రిలీజ్ జూన్ నుంచి జులైకి మారినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు జూన్ 13న విడుదల అనే టాక్ వినిపించగా.. ఇప్పుడు జులై నెలాఖరుకు మారినట్లు లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తునారు. ఈ చిత్రాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

Recent

- Advertisment -spot_img