Homeహైదరాబాద్latest Newsలక్కంటే ఇతనిదే.. ఏకంగా పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు.. ఇంతకీ అతను ఎవరంటే..?

లక్కంటే ఇతనిదే.. ఏకంగా పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు.. ఇంతకీ అతను ఎవరంటే..?

గ్రామీణ ప్రాంతానికి చెందిన గంగా శంకర్ అనే యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా, నిర్విరామంగా కళాకారుడిగా రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్య పల్లి గ్రామానికి గంగా శంకర్ అనే యువకుడు.. గత 12 సంవత్సరాలుగా తన వృత్తి రంగమైన ఒగ్గు కథలో వారి సహచరులతో కలిసి రాణిస్తున్నారు.. అలాగే అందులో ఓ భాగమైనటువంటి ఓగ్గు డోలు దరువును కూడా గత 7 సంవత్సరాలుగా వాయిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి స్వరాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా వివిధ రకాల సాంస్కృతిక, బోనాల పండగ కార్యక్రమాలు చేస్తూ.. అనేక అవార్డులు,ప్రశంసా పత్రాలు, సన్మాన సత్కారాలు అందుకున్నాడు. తాజాగా ఇతని కష్టానికి ప్రతిఫలం లభించింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు.

Recent

- Advertisment -spot_img