ప్రతి వంటలో ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. ఇందులో మంచి పోషకాలు మరియు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయలు శరీర ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా కాలుష్యం వల్ల బలహీనపడిన వెంట్రుకల కుదుళ్లకు మంచి బలాన్ని అందించడంలో ఉల్లిపాయ నూనె చాలా సహాయపడుతుంది. ఉల్లిపాయ హెయిర్ ఆయిల్‌లోని శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.