High Court : తెలంగాణ హైకోర్టులో (High Court ) గుండెపోటుతో న్యాయవాది పసునూరి వేణుగోపాల్ మరణించారు. ఈరోజు తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పసునూరి వేణుగోపాల్ అక్కడే కుప్పకూలి మృతి చెందారు. న్యాయవాది వేణుగోపాల్ వాదిస్తూనే మరణించడంతో తోటి న్యాయవాదులు షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.