కొడంగల్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేక అధికారిపై దాడిని వ్యతిరేకిస్తూ ఓ వైపు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లగచర్లలో పోలీసులు భారీగా మోహరించారు. దాడి వెనుక బిఆర్ఎస్ హస్తం ఉందని హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ఈ తరుణంలో గ్రామస్థుల అరెస్టులకు నిరసనగా బిఆర్ఎస్ నేతలు కొడంగల్ కు బయల్దేరారు. ఈ వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.