HomeజాతీయంHMPV వైరస్.. భారత్‌లో లాక్‌డౌన్ అంటూ ప్రచారం.. క్లారిటీ వచ్చేసిందిగా..!

HMPV వైరస్.. భారత్‌లో లాక్‌డౌన్ అంటూ ప్రచారం.. క్లారిటీ వచ్చేసిందిగా..!

చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నHMPV వైరస్ కేసులు భారతదేశంలో కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల గుజరాత్‌లో మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు బాధితులందరూ పిల్లలే, కానీ మొదటిసారిగా ఒక వృద్ధుడికి వైరస్ సోకింది. అహ్మదాబాద్‌కు చెందిన 80 ఏళ్ల వ్యక్తికి HMPV వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో గుజరాత్‌లో HMPV కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 9కి చేరుకుంది. భారత్‌లోకి HMPV ప్రవేశించడంతో వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సైతం ‘లాక్‌డౌన్’ థంబ్ నెయిల్స్‌లో ఆసత్యపు ప్రచారం చేస్తుండటంతో కేంద్రానికి చెందిన PIB FACTCHECK స్పందించింది. కేంద్రం అలాంటి నిర్ణయమేది తీసుకోలేదని.. ఇలాంటివి నమ్మి ఆందోళన చెందొద్దని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకూ ఏ విషయాన్నీ నమ్మొదని తెలిపింది.

HMPV
HMPV
ALSO READ

HMPV వైరస్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలివే..!

Recent

- Advertisment -spot_img