Homeహైదరాబాద్latest Newsభూ కబ్జాలతో హైదరాబాద్‌ బ్రాండ్‌ దెబ్బతింటోంది : సీఎం రేవంత్ రెడ్డి

భూ కబ్జాలతో హైదరాబాద్‌ బ్రాండ్‌ దెబ్బతింటోంది : సీఎం రేవంత్ రెడ్డి

ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లై ఓవర్ ఓపెనింగ్ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో సీఎం మాట్లాడుతూ.. ఈ ఫ్లై ఓవర్‌కు మాజీ ప్రధాని ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు’ పెట్టినట్టు సీఎం రేవంత్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భూ కబ్జాలతో హైదరాబాద్‌ బ్రాండ్‌ దెబ్బతింటోంది అని అన్నారు. ఇప్పుడు నగరంలో చిన్న వర్షం వచ్చినా మునిగిపోయే పరిస్థితి వచ్చింది.. మూసీని పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ – ఎంఐఎం కలిసి హైదరాబాద్‌ అభివృద్ధి కోసం పని చేస్తాయి అని అన్నారు. అసదుద్దీన్‌తో స్నేహం చేయాల్సి వస్తే.. అది కూడా చేస్తాం అని తెలిపారు. హైదరాబాద్‌, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీతో గొడవ పడాల్సి వస్తే.. గొడవపడతాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Recent

- Advertisment -spot_img