Homeజిల్లా వార్తలుహైడ్రా ఆన్ ఫైర్.. రెండో రోజు కొనసాగుతున్న కూల్చివేతలు..

హైడ్రా ఆన్ ఫైర్.. రెండో రోజు కొనసాగుతున్న కూల్చివేతలు..

ఇదేనిజం, శేరిలింగంపల్లి: అక్రమ నిర్మాణాలపై  హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో హైడ్రా అధికారులు రెండో రోజు కూల్చి వేతలు చేపట్టారు. చందానగర్ సర్కిల్ 21  హఫీజ్పెట్ డివిజన్ వైశాలి నగర్ లోని ఈర్ల చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన మూడు అక్రమ నిర్మాణానాలను హైడ్రా అధికారులు  పూర్తిగా నేల మట్టం చేశారు. మొదటి రోజు 1 భవనం కూల్చగా రెండోరోజు మరో రెండు భవనాలను అధికారులు పూర్తిగా నేల మట్టం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను స్వయంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పర్యవేక్షించారు. హైడ్రా అధికారులు మియాపూర్, గంగారం చెరువు ఎఫ్టియల్, బఫర్ జోన్ల లో వెలిసిన మరిన్ని కూల్చివేయనున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img