హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. NTL, బఫర్ జోన్ లో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయబోమని తెలిపారు. కొత్త నిర్మాణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకొని కూలుస్తున్నామన్నారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. కాగా, రంగనాథ్ ప్రకటనతో ఇప్పటికీ ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న యజమానులకు భారీ ఉపశమనం కలిగింది.