తన అందాలతో అబ్బురపరిచే ముద్దుగుమ్మ టబు.. తెలుగు, హిందీ భాషల్లో కొన్ని సినిమాలు చేసిన ఈ భామకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే బాలీవుడ్ బ్యూటీ మాత్రం 50 ఏళ్లు వచ్చినా జీవితంలో ఒంటరిగానే గడుపుతోంది. అయితే ఈ భామ ఒంటరిగా ఉండడానికి ఓ స్టార్ హీరో కారణమని వార్తలొస్తున్నాయి. వెంకటేష్ హీరోగా నటించిన ‘కూలీ నెంబర్ వన్’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఓ హీరోనే అని టబు సంచలన వ్యాఖ్య చేసింది. ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ హీరో.. అజయ్ దేవగన్.. అజయ్, టబుల మధ్య అనైతిక సంబంధం ఉందని ఒకప్పుడు ప్రచారం జరిగింది. టబు అజయ్ దేవగన్‌తో చాలా సినిమాలు చేసింది మరియు వారు మంచి స్నేహితులు. అలాగే హీరోయిన్ టబు సోదరుడు సమీర్, అజయ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. నటికి 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, ఎవరైనా అబ్బాయి నన్ను అనుసరిస్తే, అజయ్ మరియు మా అన్నయ్య వారిని కొట్టేవారు అని చెప్పింది. కాబట్టి అబ్బాయిలు నాతో మాట్లాడటానికి మరియు నన్ను చూడడానికి భయపడ్డారు. అందుకే తనకు ఇంకా పెళ్లి కాలేదని టబు సరదాగా చెప్పింది.