సహజ నటి సాయి పల్లవి సినిమాల్లో మరియు నిజ జీవితంలో మేకప్ లేకుండా సహజంగా కనిపించడానికి ఇష్టపడుతుంది. అంతే కాకుండా వైద్యురాలిగా ఉన్న ఆమెకు కాస్మెటిక్ ఉత్పత్తుల వల్ల చర్మానికి కలిగే నష్టాల గురించి బాగా తెలుసు. అందుకే ఓ కాస్మెటిక్ కంపెనీ ఓ ప్రకటనలో నటించమని సంప్రదించగా సాయి పల్లవి నిరాకరించిందట. ఎన్ని కోట్లు ఇచ్చినా ఇలాంటి యాడ్స్ లో నటించడానికి ఇష్టపడనని చెప్పిందట. ఇదిలా ఉంటె ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా “తండేల్” మూవీ మేకర్స్ ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు. తాండల్ సినిమా షూటింగ్ లో సాయి పల్లవి డిఫరెంట్ ఎమోషన్స్ తో ఉన్న వీడియో అది. ఈ సినిమాలో నటిగా ఆమె నటన ఎలా ఉండబోతుందో వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఇప్పటికే ఈ వీడియో కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.