హైడ్రా కూల్చివేతలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బఫర్ జోన్‌లో ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీద్ ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూల్చివేస్తారని హైడ్రాను ఆయన ప్రశ్నించారు. ఫాతిమా కాలేజీ కూల్చివేతపై సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కచ్చితమైన తేదీని ప్రకటించాలని కోరారు. ఒవైసీ కాలేజీని కూల్చకపోతే హైడ్రా విఫలమైనట్లేనని అన్నారు. ఆ కాలేజీని కూల్చితే సీఎం రేవంత్ హీరో అవుతారని అన్నారు.