Homeహైదరాబాద్latest Newsకపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే.. ఆ విషయంలో సంతృప్తి ఉండదా..?

కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే.. ఆ విషయంలో సంతృప్తి ఉండదా..?

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా?.. అయితే మీ వయసుకు తగ్గ భాగస్వామిని ఎంచుకోమని పెద్దలు సలహా ఇస్తున్నారు. రెండు మూడేళ్లయినా పర్వాలేదు. కానీ అంతకన్న ఎక్కువ ఉన్న, తగ్గినా మంచిది కాదని కూడా కొందరు నిపుణులు చెబుతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. సెలబ్రిటీల మధ్య ఇలాంటి రిలేషన్ షిప్ అనేది సర్వసాధారణం… వారి మధ్య అవగాహన ఉంటే ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ.. సాధారణంగా ఏజ్ గ్యాప్ రిలేషన్ షిప్ లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదేంటో చూద్దాం.

  1. ఎక్కువగా ఏజ్ గ్యాప్ ఉన్న స్త్రీ, పురుషులు పెళ్లి చేసుకుంటే వారి లైంగిక జీవితం సంతృప్తిగా ఉండకపోవచ్చు.
  2. మహిళలు ఎక్కవ వయస్సు కలిగి ఉన్నప్పుడు వారి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది.
  3. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ లోపంవల్ల సెక్స్ కోరికలు తగ్గుతాయి. దీంతో ఎక్కువ ఏజ్ ఉన్న స్త్రీని, తక్కువ ఏజ్ ఉన్న పురుషుడు పెళ్లి చేసుకుంటే భార్యా భర్తల మధ్య తగాదాలు ఏర్పడవచ్చు.
  4. అలాగే పురుషుడికి ఎక్కువ వయస్సు ఉన్న పురుషుడిని, తక్కువ ఏజ్ కలిగిన స్త్రీ పెళ్లి చేసుకోవడం వల్ల కూడా సమస్య ఉంటుంది. ఇక్కడ పురుషుడిలో లైంగిక సామర్థ్యం తగ్గడం, లిబిడో వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
  5. అలాగే భార్య భర్తల బంధంలో వివాదాలు తలెత్తవచ్చు. అలాగే సమానమైన వయస్సులేకపోతే పరస్పరం అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు.
  6. ముఖ్యంగా ఎమోషనల్ సపోర్ట్‌లో తేడాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Recent

- Advertisment -spot_img