Homeహైదరాబాద్latest News'అలా చేస్తే ఇండియన్ టీంకే నష్టం' : రోహిత్

‘అలా చేస్తే ఇండియన్ టీంకే నష్టం’ : రోహిత్

Idenijam, Webdesk : ఐపీఎల్ 17వ సీజన్‌లో బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడుతున్నారు. ఫలితంగా రికార్డు స్థాయిలో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం టీమిండియా క్రికెటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఓ యూట్యూబ్ షోలో భారీ స్కోర్ల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టీ20 లో ఇంపాక్ట్ ప్లేయర్ విధానానికి తాను వ్యతిరేకమని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ల వల్ల శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, తెవాటియా, రియాన్ పరాగ్ వంటి ఆల్ రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం రావట్లేదని పేర్కొన్నాడు. ఈ పరిణామం ఇండియన్ క్రికెట్ పైన ప్రభావం చూపిస్తుందని హెచ్చరించాడు. 2008 నుంచి 2023 వరకు కేవలం 2 సార్లు మాత్రమే ఓ ఇన్నింగ్స్‌లో 250 కంటే ఎక్కువ పరుగులు వచ్చాయని..కానీ ఈ సీజన్‌లో ఇప్పటికే 4 సార్లు 250 కంటే ఎక్కువగా స్కోర్లు నమోదయ్యాయని చెప్పాడు. క్రికెట్ 11 మంది ఆడే అట అని , 12 మంది వద్దని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

Recent

- Advertisment -spot_img