– ‘మమత’ స్టూడెంట్స్ ఓట్లు నమోదు చేసుకుంటే తప్పేంటి?
– మంత్రి పువ్వాడ అజయ్
ఇదేనిజం, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని.. ఇంటి నంబర్ లేకుండానే ఓట్లు నమోదు చేసుకుంటున్నారని ఇటీవల మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై మంత్రి పువ్వాడ అజయ్ తీవ్రంగా స్పందించారు. మమత మెడికల్ కళాశాల విద్యార్థులు ఓట్లు నమోదు చేసుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. దొంగ ఓట్ల నమోదుపై ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) లేఖ రాయడంపై మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. కక్షపూరితంగానే మమత వైద్య కళాశాల విద్యార్థుల ఓట్లపై తుమ్మల ఈసీకి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ‘తుమ్మలకు ఓటు వేస్తే మంచి ఓటు.. లేకపోతే దొంగ ఓటా? తుమ్మలకు ఓటువేసేవారికే ఓటు ఉండాలా? 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయొచ్చు.’ అంటూ పువ్వాడ ప్రశ్నించారు.