Homeవిద్య & ఉద్యోగంIISC Online Course : డిజిటల్ హెల్త్​పై ఆరు నెలల ఆన్‌లైన్ కోర్సు..

IISC Online Course : డిజిటల్ హెల్త్​పై ఆరు నెలల ఆన్‌లైన్ కోర్సు..

IISC Online Course : డిజిటల్ హెల్త్​పై ఆరు నెలల ఆన్‌లైన్ కోర్సు..

IISC Online Course : దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (Indian Institute of Science), బెంగళూరు (Bangalore) డిజిటల్ హెల్త్ అండ్ ఇమేజింగ్‌లో ఆరు నెలల అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.

హెల్త్‌కేర్, టెక్నాలజీ బిల్డింగ్ ఈ-హెల్త్, టెలిమెడిసిన్, పర్సనలైజ్డ్ హెల్త్‌కేర్, బయోటెక్, మెడికల్ డివైజ్‌ (Medical Device)లు, వేరబుల్స్, డిజిటల్ థెరప్యూటిక్స్ రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ ప్రోగ్రామ్​ను అందిస్తోంది.

సైన్స్, ఇంజనీరింగ్ (Engineering), మెడిసిన్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ప్రోగ్రామ్​ (Program)కు దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే సంబంధిత విభాగంలో వారికి ఏడాది పని అనుభవం కూడా ఉండాలి.

టాలెంట్​ స్ప్రింట్​ భాగస్వామ్యంతో..

టాలెంట్‌స్ప్రింట్‌ భాగస్వామ్యంతో ఐఐఎస్​సీ ఈ కోర్సును అందిస్తోంది.

ఆన్‌లైన్ కోర్సులో భాగంగా ఎడ్టెక్ కంపెనీకి చెందిన బ్రిడ్జ్ మాడ్యూల్ ద్వారా శిక్షణనిస్తోంది.

మ్యాథ్స్ (Math)​, ప్రోగ్రామింగ్‌లో అభ్యర్థి లోతైన అవగాహన పెంచుకోవడంలో సహాయపడుతుంది.

– దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.

– అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు www.iisc.talentsprint.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి.

– శని, ఆదివారాల్లో మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు.

– భారతీయ అభ్యర్థులు రూ. 1,70,000, ఎన్నారై (NRI)లు $2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

– అభ్యర్థులను వారి విద్యార్హత, పని అనుభవం ఆధారంగా ఐఐఎస్సీ ఎంపిక చేస్తుంది.

కొత్త టెక్నాలజీలపై అవగాహన

ఈ ప్రోగ్రామ్​ను ఐఐఎస్​సీలోని సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (CCE) విభాగం నిర్వహిస్తుంది.

హెల్త్​ సెక్టార్​లోని విద్యార్థులకు కొత్త టెక్నాలజీస్​పై అవగాహన పెంచే విధంగా ఈ కోర్సును డిజైన్​ చేసింది.

రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (Research and Development) లాబొరేటరీలు, పరిశ్రమల్లో పనిచేసే రీసెర్చ్ సైంటిస్ట్‌లు/ఇంజినీర్లు, టెక్నాలజీ ఇంటెన్సివ్, డేటా ఆధారిత సంస్థల నిర్వాహకులకు ఈ కోర్సు (Course) ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారిక నోటీసులో పేర్కొంది.

నేర్పించే అంశాలివే..

– ఈ డిజిటల్ హెల్త్ అండ్ ఇమేజింగ్ కోర్సులో భాగంగా ఎసెన్షియల్ మ్యాథ్, ప్రోగ్రామింగ్, డిజిటల్ హెల్త్‌ ఇంట్రడక్షన్​, వేరెబుల్​ డివైజెస్​, ఫిజియోలాజికల్ సిగ్నల్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, డిజిటల్ హెల్త్ అండ్​ ఇమేజింగ్/విజన్‌ వంటి విభాగాలపై లోతైన అవగాహన పెంచుకోవచ్చు.

– ఈ కోర్సులను నేర్చుకున్న అభ్యర్థులకు హెల్త్‌కేర్ డేటా (Health Care DATA) అనలిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్, హెల్త్ ఏఐ, సీనియర్ మెడికల్ ఇమేజింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, రీసెర్చ్ సైంటిస్ట్ – హెల్త్‌కేర్ ఇమేజ్ అనలిటిక్స్, డిజిటల్ హెల్త్ కన్సల్టెంట్ అండ్​ డిజిటల్ హెల్త్ డెవలపర్​గా అనేక అవకాశాలు లభిస్తాయి.

మ‌రిన్ని ఉద్యోగాల వివ‌రాలు

Recent

- Advertisment -spot_img