Imran Khan : పాకిస్తాన్ లో మరో సంచలనం చోటుచేసుకుంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు (Imran Khan) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు , అతని భార్య బుష్రా బీబీని దోషులుగా కోర్టు నిర్ధారించింది. కోర్టు ఇమ్రాన్ ఖాన్ కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, బుష్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అదనంగా, ఇమ్రాన్ ఖాన్ కు 1 మిలియన్ పాకిస్తానీలు, బుష్రా బీబీకి 5 లక్షల పాకిస్తానీలు జరిమానా విధించారు. అడియాలా జైలులో గట్టి భద్రత మధ్య ఈ తీర్పు వెలువడింది. లండన్‌లో ఉంటున్న పాకిస్థానీ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాలిక్ రియాజ్ హుస్సేన్ నుంచి సేకరించిన 19 మిలియన్ పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం పాకిస్థాన్‌కు పంపగా.. ఇమ్రాన్ దంపతులు ఆ సొమ్మును కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌పై ఇప్పటి వరకు 200కు పైగా కేసులు ఉన్నాయి. అతను ఆగస్టు 2023 నుండి తన జీవితాన్ని జైలులో గడుపుతున్నాడు.