తెలంగాణలో దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు వీలైనంత త్వరగా పెంచుతామని మంత్రి సీతక్క అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడలను మంత్రి ప్రారంభించారు. బ్యాక్ ల్యాగ్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.