చెపాక్ వేదికగా భారత్ – బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 88/3 పరుగులు చేసింది. క్రీజ్‌లో యశస్వి జైస్వాల్ (37), రిషభ్ పంత్ (33) ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అంతకుముందు రోహిత్ (6), విరాట్ కోహ్లీ (6) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు.