Homeస్పోర్ట్స్ఇంగ్లాండ్‌ని కుప్పకూల్చిన భారత్

ఇంగ్లాండ్‌ని కుప్పకూల్చిన భారత్

India were all out for 205 on the first day of the fourth Test at Ahmedabad on Thursday.

Akshar Patel (4/68) and Ashwin (3/47) were the other spinners on the spin-friendly pitch.

అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ టీమ్‌ని తొలిరోజే భారత్ జట్టు 205 పరుగులకి ఆలౌట్ చేసింది.

స్పిన్‌కి అనుకూలించిన పిచ్‌పై మరోసారి స్పిన్నర్లు అక్షర్ పటేల్ (4/68), అశ్విన్ (3/47) చెలరేగగా.. ఇంగ్లాండ్ టీమ్‌లో బెన్‌స్టోక్స్ (55: 126 బంతుల్లో 6×4, 2×6), డేనియల్ లారెన్స్ (46: 74 బంతుల్లో 8×4) చెప్పుకోదగిన స్కోరు చేశారు.

ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లు సింగిల్ డిజిట్‌కే పరిమితమైనా.. ఇంగ్లాండ్ టీమ్ 75.5 ఓవర్ల పాటు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం విశేషం.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

కానీ.. ఓపెనర్లు డొమినిక్ సిబ్లీ (2), జాక్ కార్లీ (9)లను ఆరంభంలోనే ఔట్ చేసిన అక్షర్ పటేల్.. ఆ జట్టుని ఒత్తిడిలోకి నెట్టేశాడు.

అనంతరం వచ్చిన జానీ బెయిర్‌‌స్టో (28), కెప్టెన్ జో రూట్ (5)లను మహ్మద్ సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసేశాడు.

అయితే.. ఒక ఎండ్‌లో క్రీజులో నిలిచిన బెన్‌స్టోక్స్.. ఓలీ పోప్ (29: 87 బంతుల్లో 2×4)తో కలిసి ఇంగ్లాండ్ టీమ్‌ని ఆదుకునే ప్రయత్నం చేశాడు.

కానీ.. స్టోక్స్‌ని వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయగా.. ఆ తర్వాత బెన్‌ఫోక్స్ (1), డొమినిక్ బెస్ (3), జాక్ లీచ్ (7), జేమ్స్ అండర్స్ (10 నాటౌట్) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు.

నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత్ జట్టు 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఈ చివరి టెస్టుని కనీసం డ్రా చేసుకున్నా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి టీమిండియా అర్హత సాధించనుంది.

ఒకవేళ ఓడిపోతే..? ఆస్ట్రేలియా ఫైనల్‌కి వెళ్లనుంది. ఇప్పటికే ఒక ఫైనల్ బెర్తుని న్యూజిలాండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img