అమెరికాలో భారతీయుల కుటుంబ వార్షికాదాయం 92 లక్షలు
Indians Earning high in USA : అమెరికాలో ఉన్న భారతీయులు బాగా ఆర్జిస్తున్నారు.
ఒక్కో భారతీయ కుటుంబం సగటున ఏడాదికి రూ.92 లక్షలు (1.23 లక్షల డాలర్లు) సంపాదిస్తున్నది.
అమెరికా మొత్తంగా చూస్తే ఒక కుటుంబ సగటు ఆదాయం రూ.47 లక్షలు (64వేల డాలర్లు) మాత్రమే.
అంటే భారతీ యులు డబుల్ సంపాదిస్తున్నారన్న మాట.
అమెరికాలో ఉన్న భారతీయ ఇండియన్లలో 79% మంది గ్రాడ్యుయేట్లు కాగా దేశ సగటు 34శాతం మాత్రమే.
అమెరికాలో ఉన్న డాక్టర్లలో 9శాతం మంది భారత సంతతికి చెందినవారే.
ప్రస్తుతం అమెరికాలో దాదాపు 40 లక్షల మంది భారతీయులు ఉన్నారు.
గడిచిన మూడు దశాబ్దాల్లో అమెరికాలో ఆసియన్ల జనాభా మూడు రెట్లు పెరిగింది.
యూఎస్‌లో వేగంగా పెరుగుతున్న నాలుగు జాతుల్లో ఆసియన్లు ఒకరని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించింది.