తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులను గ్రామ కమిటీ సమక్షంలో మొదటిగా పేద వారికి మంచి చేకూరేలా వారిని ఎన్నుకోవడం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాము చెప్పిన విధంగా 4 విడతలుగా ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయనుందని తెలిపారు. పేదవాళ్లకి మంచి జరిగే విషయంలో, దేశంలో ఎక్కడ చేయని విధంగా 20 లక్షల ఇళ్ల నిర్మాణాలను ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టనుందని పొంగులేటి పేర్కొన్నారు.