Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్లు.. అర్హతలు, ముఖ్య వివరాలు ఇవే..!

ఇందిరమ్మ ఇళ్లు.. అర్హతలు, ముఖ్య వివరాలు ఇవే..!

  • తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారే ఈ పథకానికి అర్హులు అవుతారు.ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు.
  • పేదవాళ్ల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వటం, స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందజేయటం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం.
  • దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. పూర్తిగా ఇల్లు లేకుండా… ఎలాంటి ఆధారం లేని వారిని తొలి విడతలోనే ఎంపిక చేస్తారు. సొంత జాగాలు ఉన్నవారికి ఈ దశలో ఇళ్లను మంజూరు చేయనున్నారు.
  • సర్కార్ ఇచ్చే రూ.5 లక్షలను దఫాలవారీగా ఇస్తారు. మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తారు. బేస్‌మెంట్‌ స్థాయిలో రూ.లక్ష, శ్లాబ్ నిర్మాణం జరిగే సమయంలో రూ.లక్ష ఇస్తారు. పైకప్పు నిర్మాణం పూర్తయిన తరవాత రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష ఇస్తారు.
  • ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు.
  • ఇందిరమ్మ ఇంటికి సంబంధించి ఇటీవలనే ప్రభుత్వం నమూనాలను ఖరారు చేసింది. స్థలాన్ని బట్టి సింగిల్‌బెడ్‌ రూమ్‌, డబుల్‌ బెడ్‌ రూమ్‌, నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది. 400 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకున్న వారికి కూడా ఆర్ధిక సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం చెప్పింది.
  • జిల్లా ఇంఛార్జ్ మంత్రి అధ్యక్షతన లబ్ధిదారుల పేర్లను కలెక్టర్లు ఫైనలైజ్ చేస్తారు.
  • ప్రతి ఏడాది 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయనుంది. దాని ప్రకారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు కేటాయిస్తుంది. మిగిలిన 33,500 ఇళ్లను రిజర్వు కోటా కింద ఉంచాలని సర్కార్ నిర్ణయించింది.
  • రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌజ్ లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు జిల్లాల్లో ఈ పనులు ప్రారంభమయ్యాయి.

Recent

- Advertisment -spot_img