Indiramma houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను మరింత పారదర్శకంగా చేయడానికి మరియు సేవలను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపికను ఈ నెలాఖరులో చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించింది.
ఇందిరమ్మ ఇళ్ల (Indiramma houses) లబ్ధిదారుల ఎంపిక..
ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. సంక్రాంతిలోపు GHMC మినహా మిగతా 32 జిల్లాల్లో సర్వే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత గ్రామసభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు.
ALSO READ:
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో కొత్త రైళ్లు వస్తున్నాయ్..!
Rythu Bharosa: రైతు భరోసా అమలు పై ప్రజల సందేహాలు.. ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?