Homeహైదరాబాద్latest Newsఅంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం

ఇదే నిజం, గొల్లపల్లి: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం-అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గొల్లపల్లి ఎస్ఐ సతీష్ గొల్లపెల్లి మండల కేంద్రంలో మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుందని దాన్ని వీలైనంత త్వరగా అరికట్టాలని,మండలంలో ఎక్కడైనా గంజాయి సేవించినా,విక్రయించినా తమకు సమచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని గంజాయి నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.గంజాయి నిర్మూలన అనేది ప్రజలందరి బాధ్యత అని దానిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని ప్రతిజ్ఞ చేయించినారు.గంజాయి సేవించినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడును.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,గొల్లపల్లి మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img