హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 67 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనిపై ఢిల్లీ కెప్టెన్ పంత్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. ‘‘మంచు వస్తుందనుకొని ముందు ఫీల్డింగ్ ఎంచుకున్నాం. కానీ మంచు రాలేదు. ఇరు జట్ల మధ్య పవర్‌ప్లేనే తేడా. భారీ టార్గెట్ ఛేజ్ చేస్తున్నప్పుడు మేము మరింత ధాటిగా ఆడాల్సింది. మిగిలిన మ్యాచెస్ కోసం బలమైన ప్రణాళికతో బరిలో దిగుతాం’’ అని అన్నాడు.