Homeతెలంగాణఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం

ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం

నిరుద్యోగులకు ఇది సువర్ణావకాశం. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో దేశ వ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

అర్హత: బీఈ, బీటెక్(ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ, సీఎస్ఈ, కంప్యూటర్ ఇంజనీరింగ్, సీఎస్, ఎంఎస్సీ, పీజీ(కంప్యూటర్ అప్లికేషన్స్))

అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్–2/టెక్నికల్: 226


*యూఆర్: 93, ఈడబ్ల్యూఎస్–24, ఓబీసీ–71, ఎస్సీ–29, ఎస్టీ–9

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ– 79, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్– 147.

*గేట్ 2021/2022/2023 స్కోర్ తప్పనిసరి.

*వయస్సు: 2024 జనవరి 1 వరకు 27 సంవత్సరాలు మించరాదు.

*పే స్కేల్: నెలకు రూ.44,900–1,42,400

ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్/ ఇంటర్వ్యూ, సైకో మెట్రిక్/ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.

దరఖాస్తు ప్రారంభం: 2023 డిసెంబర్ 12
దరఖాస్తు చివరి తేది: 2024 జనవరి 12
దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేది: 2024 జనవరి 16

*ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Recent

- Advertisment -spot_img