PhonePe లో ఉద్యోగాలు..
కరోనా తరువాత పలు సంస్థలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకావాలను కల్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారతదేశం (India) లోని ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే (PhonePe) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
ఫోన్‌పేలో మ్యూచువల్ ఫండ్స్ స్పెషలిస్ట్ పోస్టును భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్.. దరఖాస్తు విధానం తెలుసుకోండి.
ఫోన్‌పేలో మ్యూచ్‌వల్ ఫండ్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు..
ఫోన్‌పేలో మ్యూచువల్ ఫండ్స్ స్పెషలిస్ట్ పోస్టును భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds)కు సంబంధించిన కస్టమర్ల (Customers) సందేహాలను పరిష్కరించాల్సి ఉంటుంది.
అంతే కాకుండా వారికి ఫండ్స్‌కు సంబంధించి మెరుగైన అనుభవాన్నిఅందించాల్సిన బాధ్యత ఉంటుంది.
ఈ జాబ్ రోల్ (Job Role) లో ముఖ్యంగా వినియోగదారుల సమస్యలు వేగంగా పరిష్కరించిందేకు కృషి చేయాలి.
అందుకు అనుగుణంగా ప్లానింగ్ (Planning)ను అందించాలి.
దరఖాస్తుకు అర్హతలు..
– దరఖాస్తు చేసుకొనే అభ్యర్థికి 0-2 సంవత్సరాల వృత్తి అనుభవం ఉండాలి.
– అద్భుతమైన వ్రాత, మౌఖిక సంభాషణా సామర్థ్యం అవసరం.
– వినియోగదారుల సమస్యలను ఓపికగా వినాలి.
– పనికి సంబంధించిన మేనేజమెంట్ స్కిల్స్ ఉండాలి.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 : ముందుగా అభ్యర్థులు www.phonepe.com యొక్క అధికారిక పోర్టల్‌ని సందర్శించాలి.
Step 3 : ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్‌ను పూర్తిగా చదవాలి.
Step 4 : వెబ్సైట్లోకి వెళ్లగానే కెరీర్ ట్యాబ్‌లోకి వెళ్లాలి.
Step 5 : అనంతరం స్పెషలిస్ట్ రిక్రూట్మెంట్ కోసం అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
Step 6 : అభ్యర్థి లింక్డ్ఇన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కెరీర్ పేజీలో అందుబాటులో ఉంది.
Step 7 : అవరసమైన వివరాలను అందించి సైన్ ఇన్ అవ్వాలి. అనంతరం దరఖాస్తు ఫాంలోని అన్ని ఫీల్డ్‌లను నింపాలి.
Step 8 : దరఖాస్తు పూర్తయిన తరువాత సబ్మిట్ చేయాలి.