Homeసినిమాకళ్యాణ్​రామ్ ‘Devil’ రిలీజ్ వాయిదా

కళ్యాణ్​రామ్ ‘Devil’ రిలీజ్ వాయిదా

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, డైరెక్టర్ అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ డెవిల్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సీక్రెట్ ఏజెంట్​గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ శ్రీకాంత్ విస్సా అందిస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ తాజాగా వాయిదా పడింది. ఈ నెల 24న వరల్డ్ వైడ్​గా థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, పలు సాంకేతిక కారణాల వలన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. త్వరలో మేకర్స్ సరికొత్త రిలీజ్ డేట్​ను ప్రకటించనున్నారు. సంయుక్త మీనన్ లేడీ లీడ్ రోల్​లో నటిస్తున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img