ముంబై: ఇప్పటికే కంగనా రనౌత్ అకౌంట్‌పై ట్విటర్ శాశ్వతంగా నిషేధం విధించిన సంగతి తెలుసు కదా.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అక్కడ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసపై అనుచిత పోస్టులు చేసిన కారణంగా ట్విటర్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
తాజా ఇన్‌స్టాగ్రామ్ కూడా కొవిడ్-19పై ఆమె చేసిన ఓ పోస్ట్‌ను తొలగించింది. ఈ విషయాన్ని కంగానానే తన ఇన్‌స్టా స్టోరీలో చెబుతూ.. ఇక్కడా నన్ను వారం రోజుల కంటే ఎక్కువ ఉండనిచ్చేలా లేరు అని కామెంట్ చేయడం విశేషం.
రెండు రోజుల కిందట తనకు కరోనా సోకిందన్న విషయం ఆమె చెప్పిన సంగతి తెలుసు కదా. ఆ పోస్ట్‌నే ఇన్‌స్టా డిలీట్ చేసింది.
ఇదో చిన్న ఫ్లూ మాత్రమే. అనవసరంగా ఎక్కువ చేసి చూపించారు. మీరు భయపడకండి.
అందరం కలిసి దీనిని ఎదుర్కొందాం అని కంగనా ఆ పోస్ట్‌లో రాసింది. దీనిపై అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
దేశంలో ఇన్ని కేసులు వచ్చి, ఇంత మంది చనిపోతుంటే ఇదో చిన్న ఫ్లూ అంటావా అంటూ చాలా మంది మండిపడ్డారు.
దీంతో ఇన్‌స్టా ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. ఇదే విషయాన్ని తన స్టోరీలో చెప్పింది.
కొవిడ్‌ను నాశనం చేస్తా అన్నందుకు కొంత మంది హర్ట్ అయ్యారట. ఇన్‌స్టాకు వచ్చి రెండు రోజులైంది కానీ ఇక్కడ కూడా వారం కంటే ఎక్కువ ఉండనిచ్చేలా లేరు అని కంగనా కామెంట్ చేసింది.