– టికెట్ల కోసం కొనసాగుతున్న ప్రయతనాలు
– కాసేపట్లో ఫస్ట్ లిస్ వచ్చే చాన్స్
– 10 మంది సిట్టింగ్ లను మార్చబోతున్నారంటూ జోరుగా ప్రచారం
– నేతల్లో తీవ్ర ఉత్కంఠ
ఇదేనిజం, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ లిస్ట్ ప్రకటనపై ఉత్కంఠ నెలకొన్నది. ఇవాళ మధ్యాహ్నం అభ్యర్థులు జాబితా బయటకు రానున్నదని జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్లో 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాదని ప్రచారం జరుగుతుండటంతో కొందరు నేతలు ఎమ్మెల్సీ కవిత ఇంటికి, హరీశ్ రావు ఇంటికి క్యూ కడుతున్నారు.
ఎమ్మెల్సీ కవితతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహుల వరుసగా భేటీ అవుతున్నారు. నిన్న కవితని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ కలిశారు. ఉదయం 6 గంటల నుంచే కవిత నివాసానికి నేతలు క్యూ కట్టారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ ఎమ్మెల్సీ కవితను కలిశారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మా రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు కవితను కలిశారు. ఇక ఇల్లందు, సంగారెడ్డి, స్టేషన్ ఘనపూర్ నేతలు హరీష్ రావును కలిశారు. అలాగే కవితతో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ సైతం భేటీ అయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలు భేటీ అయ్యారు. దీంతో ఎవరికి టికెట్ దక్కుతుంది? ఎవరికి దక్కదు? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొన్నది.