నేడు తెలంగాణ అసెంబ్లీ ఏడవ రోజుకు చేరుకుంది.ఈ రోజు అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరగనుంది. ఈ రోజు ప్రశ్నోత్తరాలు రద్దుచేయడంతో రైతు భరోసాపై సమావేశంలో నేరుగా చర్చించనున్నారు. దీంతో రైతు భరోసా నిధుల విడుదలపై సభ్యులంతా చర్చించనున్నారు. ఈ క్రమంలో రైతు బీమా నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. నేడు అసెంబ్లీలో కొత్త విద్యుత్ పంపిణీ విధానాన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో చర్చించే అవకాశం ఉంది.