దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత జెలుకెళ్లక తప్పదని భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థ లేదని.. కుటుంబ పాలన నడుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ను గద్దె దించేందుకు పార్టీలకు అతీతంగా నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.