Homeఫ్లాష్ ఫ్లాష్KTR: అన‌ర్గ‌ళంగా మోడీ అబ‌ద్ధాలు-కేటీఆర్

KTR: అన‌ర్గ‌ళంగా మోడీ అబ‌ద్ధాలు-కేటీఆర్

  • రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదు
  • ప్ర‌ధాని ప్ర‌సంగంపై కేటీఆర్ విమ‌ర్శ‌లు

KTR:ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగంపై ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. వ‌రంగ‌ల్ స‌భ‌లో మోడీ అన‌ర్గ‌ళంగా అబ‌ద్ధాలు చెప్ప‌డం త‌ప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేద‌ని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఇవాళ‌ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల అని పేర్కొన్నారు. గుజరాత్ కు రూ. 20 వేల కోట్ల రూపాయల లోకోమోటివ్ ఫ్యాక్టరీ తన్నుకుపోయిన ప్రధాని, తెలంగాణకు మాత్రం రూ. 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్ట‌డం ఏమిట‌ని విమ‌ర్శించారు.

తొమ్మిదేళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని చెప్పారా? అని ప్ర‌శ్నించారు. దేశంలో నిరుద్యోగం పెంచింది మోడీయేన‌ని విమ‌ర్శించారు. 16 లక్షల ఖాళీలు భర్తీచేయకుండా, రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నింపిన తెలంగాణ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోమన్న ప్రధాని యువత గురించి మాట్లాడటం ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నారు. ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించకుండా యూనివర్సిటీ ఖాళీల భర్తీని అడ్డుకుంటున్న గవర్నర్ కి ప్రధాని ఒక మాట చెబితే బాగుండేద‌ని సూచించారు.. గిరిజన విశ్వవిద్యాలయాన్ని అడ్డుకొని, అడవి బిడ్డల గురించి మాట్లాడటం ప్రధాని కపటప్రేమకు నిదర్శనమ‌న్నారు. 15 వేల మంది స్ధానికులకు ఉద్యోగాలిచ్చే బయ్యారం ఫ్యాక్టరీపై మోడీ ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేద‌ని ఆరోపించారు.

700 మంది రైతుల‌ను పొట్ట‌న పెట్టుకున్న కేంద్రం నల్ల చట్టాలతో 700 మంది రైతులను కేంద్రం పొట్ట‌న పెట్టుకున్న‌దని.. అటువంటిది ప్ర‌ధాని మోడీ రైతుల గురించి మాట్లాడ‌టం ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నారు. ప్రధాని వ్యవసాయంపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లేన‌న్నారు. ఉపన్యాసం ఇచ్చి ఉత్త చేతులతో పోవడం మోడీకి అలవాటుగా మారింద‌న్నారు. మోడీ పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని కేటీఆర్ విమ‌ర్శించారు.

Recent

- Advertisment -spot_img