KTR : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు భారీ షాక్ తగిలింది.కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది. పోలీసుల ఆదేశాలను పాటించకుండా ర్యాలీ నిర్వహించారని బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేసారు. నిన్న విచారణ అనంతరం ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్(KTR) బయటకు వచ్చారు. అయితే ఈ క్రమంలో తెలంగాణ భవన్ వరకు అనుమతి లేకుండా ర్యాలీ చేసారు అని కేటీఆర్ పై ఫిర్యాదు చేసారు. ఈ ఘటనలో మరో ఆరుగురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు.