Homeజిల్లా వార్తలుఎఐఎఫ్డిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయండి : రాష్ట్ర సహాయకార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్

ఎఐఎఫ్డిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయండి : రాష్ట్ర సహాయకార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్

ఇదే నిజం జనవరి 6 బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య( ఎఐఎఫ్డిఎస్) తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల కరపత్రాలను ఎఐఎఫ్డిఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్,ఎంసిపిఐ (యు) జిల్లా సహాయకార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థిసమాఖ్య( ఎఐఎఫ్డిఎస్) చదువు పోరాడు, సాధించు అనే నినాదంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక విద్యార్థి ఉద్యమాలను నిర్మిస్తున్నదని, రాష్ర్టవ్యాప్త విద్యార్థి పోరాటాల్లో భాగంగానే అన్ని జిల్లాలలో నిర్మాణం చేసుకునే దిశగా ఈనెల 22, 23 తేదీలలో కామ్రేడ్ బండారి చిరంజీవి హాల్, హంటర్ రోడ్, హనుమకొండలో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని, 1984లో ఐక్య విద్యార్థి సమైక్య పేరుతో ఆవిర్భవించిన ఈ సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మురళీధర్ రావు కమిషన్ బీసీ రిజర్వేషన్లపై మద్దతుగా పోరాడిందని, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు అనుకూలంగా ప్రభుత్వ విద్యా విధానాన్ని పరిరక్షించాలని పోరాడి విజయం సాధించిందని, నాటి యుఎస్ఎఫ్ నేడు దేశవ్యాప్తంగా వచ్చిన ప్రజాతంత్ర విద్యార్థి శక్తులను కలుపుకొని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ (ఎఐఎఫ్డిఎస్)గా దేశవ్యాప్తంగా ఒక నికచ్చితమైన విప్లవకర విద్యార్థి సంఘంగా అవతరించిందని తెలిపారు.
విద్యార్థి ప్రజా పోరాటాల్లో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతుందని, కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి తన రెండవసారి ప్రభుత్వం ఏర్పడిన కాలంలోనే విద్య కాషాయీకరణ చేయడమే ముఖ్య ఎజెండాగా పనిచేస్తుందని, అందుకు తగ్గట్టుగానే విద్యావ్యవస్థలో పలు మార్పులు, చేర్పులు చేస్తూ దేశ స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన ఎందరో విప్లవకారుల చరిత్రలను పాఠ్య పుస్తకాల నుండి తొలగించి ఎన్ ఈ పి-2020 ద్వారా బలవంతంగా మూఢనమ్మకాలను ప్రేరేపించే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బిజెపి యొక్క వ్యక్తిగత వాదమైన మనువాదాన్ని, విద్య కాషాయీకరణ అనే ఎజెండాలను అమలు చేసే దిశగా బలంగా పూనుకుందని, కావున బిజెపి యొక్క మనువాద మత చాందస భావాలను ఎఐఎఫ్డిఎస్ దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ శాస్త్రీయ విద్యా విధానం కావాలని, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులకు వ్యతిరేకంగా మరియు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దుచేసి కామన్ స్కూల్ విద్యా విధానంపై అనేక పోరాటాలు చేసిందని, భవిష్యత్తులో కూడా విద్యార్థి లోకానికి అండగా మరెన్నో సమరశీల పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటుందని తెలిపారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2012-2013 సంవత్సరంలో ఉన్న విద్యాశాఖ బడ్జెట్ 15.45% బడ్జెట్ ని గడిచిన 10 ఏళ్లలో నేటి వరకు కేవలం నాలుగు శాతం మాత్రమే పెంచిందని, ప్రస్తుతం 19.56% బడ్జెట్ తో విద్యారంగం కొనసాగుతుందని, ప్రతి సంవత్సరానికి 0.36 శాతం మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారని, ఈ రకమైన బడ్జెట్ తో విద్యారంగానికి ఏ రకంగా మేలు జరుగుతుందనే విషయాన్ని పరిగణించాల్సిన అవసరం ఉందని అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని, 2014 -2015 విద్యా సంవత్సరానికి 10.89 శాతం ఉన్న బడ్జెట్ సంవత్సరాలు వారిగా తగ్గుకుంటూ 2015-16 సంవత్సరానికి 9.69 శాతం, 2016-17 సంవత్సరానికి 8.23 శాతం, 2017 -18 సంవత్సరానికి 8.49 శాతం, 2018-19 సంవత్సరానికి 7.61 శాతం,2019-20 సంవత్సరానికి 6.76 శాతం, 2029-21 సంవత్సరానికి 6.69 శాతం,2021-22 సంవత్సరానికి 6.78 శాతం, 2022 23 సంవత్సరానికి 6.24 శాతం, 2023-24 సంవత్సరానికి 7.31 శాతం నిధులు కేటాయించడం జరిగిందని, విద్యాహక్కు చట్టప్రకారం కేంద్ర,రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వాలు ప్రతి ఏటా నిధులు తగ్గిస్తూ విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని, బిజెపి పార్టీ 2014 ఎన్నికల వాగ్దానాల్లో విద్యార్థి లోకానికి మరియు నిరుద్యోగ యువతకు అనేక వాగ్దానాలు చేసిందని, వాటిలో ప్రధానంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా నేడు దేశంలో అనేక పోటీ పరీక్ష పత్రాల లీకేజీలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని తద్వారా గడిచిన ఏడు సంవత్సరాల లో 15 రాష్ట్రాల వారిగా 70 సార్లు పరీక్ష పత్రాలు లీకేజీ అవ్వడంతో 1.7 కోట్ల విద్యార్థి లోకం పరీక్షలు రాయలేక నష్టపోయారని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్‌షిప్ నిధులు 7800 కోట్ల రూపాయల బకాయిలు గత మూడు సంవత్సరాలుగా విడుదల చేయకపోవడంతో దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు తీవ్ర మనోవేదన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యారంగంపై సమీక్ష నిర్వహించి విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యల పరిష్కరణకై పెద్ద పీట వేయాలని, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగ విధానాలకు వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో విఫలమైన కేజీ టు పీజీ విద్యా విధానంతో పాటు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో మౌలిక వసతులు కల్పిస్తూ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కొరతను భర్తీ చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వ యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించాలన సమరశీల పోరాటాలు నిర్మించాలనే సంకల్పంతో ఈ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల ను ఈనెల 22 23 తేదీలలో హనుమకొండలో నిర్వహిస్తున్నామని, ఈ సమావేశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు.

Recent

- Advertisment -spot_img