Homeఫ్లాష్ ఫ్లాష్Mark Miller: We welcome India's decision on visa renewal Mark Miller...

Mark Miller: We welcome India’s decision on visa renewal Mark Miller : వీసా పునరుద్ధరణపై భారత్​ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

– కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్​ మిల్లర్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: వీసా సర్వీసుల్ని గురువారం నుంచి పునరుద్ధరించాలన్న భారత్ నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది. ఈ ఆందోళనకర సమయంలో కెనడా వాసులకు ఇది సానుకూల సంకేతమని అభిప్రాయపడింది. ఖలిస్థాన్‌ వేర్పాటువాది నిజ్జర్‌ హత్య విషయంలో భారత్‌-కెనడా మధ్య దౌత్యవివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీసాల జారీ ప్రక్రియను భారత్‌ నిలిపివేసింది. బుధవారం ఆ నిర్ణయాన్ని కొంత మార్చుకుంది. ‘భారత దౌత్యవేత్తల రక్షణ విషయంలో తాజాగా కెనడా తీసుకున్న కొన్ని నిర్ణయాలను పరిగణనలోకి తీసుకొని, భద్రతా పరిస్థితిని సమీక్షించాం.

ఎంట్రీ వీసా, బిజినెస్‌ వీసా, మెడికల్‌ వీసా, కాన్ఫరెన్స్‌ వీసా సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించాం’ అని ఒటావాలోని భారత్‌ హైకమిషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై కెనడా ఇమ్మిగ్రేషన్‌ మినిస్టర్ మార్క్‌ మిల్లర్ స్పందించారు.‘ఆందోళనకర సమయాల తర్వాత భారత్‌ చర్య సానుకూల సంకేతం. ఎందరో కెనడా వాసులకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. భారత్‌తో దౌత్యపరమైన ఆందోళన ఎన్నో వర్గాల్లో భయాన్ని సృష్టించింది. ఇలాంటి పరిణామాల వేళ రద్దు అనేది మొదటి నిర్ణయం కాకూడదని మా అభిప్రాయం’ అని అన్నారు. అలాగే భారత్‌ నిర్ణయంపై మరో మంత్రి హర్జిత్ సజ్జన్ స్పందిస్తూ.. ఇది మంచి నిర్ణయం అన్నారు. అయితే, దీనివెనక ఉన్న భారత్ ఉద్దేశమేంటో తమకు తెలియదన్నారు.

Recent

- Advertisment -spot_img