ఈ మధ్యకాలంలో స్టార్ నటులు, నటీమణుల పిల్లలు సినిమా రంగంలోకి రావడం మామూలే. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో కూతురు కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట సపోర్టింగ్ యాక్టర్ గా ఎదిగి కో-డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మాస్ మహారాజా రవితేజ ఎదిగాడు. అయితే తాజాగా రవితేజ కూతురు ఇప్పుడు సినిమా రంగ ప్రవేశం చేయనుంది. రవితేజకు ఇద్దరు పిల్లలు మోక్షద, మహాధన్ భూపతిరాజ్, రవితేజ కూతురు మోక్షద సినిమా రంగంలోకి అడుగుపెట్టబోతుంది.మోక్షద డైరెక్షన్ వైపు అడుగులు వేస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ మోక్షద పని చేయనున్నారు. రవితేజ కెరీర్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గానే మొదలైంది.తర్వాత హీరోగా మారాడు. అయితే మోక్షద కూడా ముందు దర్శకత్వం నేర్చుకుని ఆ తరువాత హీరోయినిగా మారుతుందేమో చూడాలి.