Homeహైదరాబాద్latest Newsగ్రూప్-1 పరీక్షపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

గ్రూప్-1 పరీక్షపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

గ్రూప్-1 పరీక్ష రద్దుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేసారు . ఎవరు ఏం చేసినా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఆగదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతల వలలో పడవద్దని అభ్యర్థులకు సూచించారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలు జరిగాయని ఆమె ఆరోపించారు. గత పదేళ్లుగా డీఎస్పీ, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడం లేదని, అప్పటి ప్రభుత్వం నిర్వహించే ఆలోచన కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఇప్పుడు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తే ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు.

Recent

- Advertisment -spot_img